జైపూర్, ఏప్రిల్ 6: వేసవిలో పేద, మధ్యతరగతి ప్రజల కూల్‌డ్రింక్‌గా పిలిచే షర్బత్ (నిమ్మకాయ రసం) రాజస్థాన్‌లో ఇప్పుడు డబ్బున్న వాళ్లు మాత్రమే తాగే డ్రింక్‌గా మారింది. దీనికి కారణం అక్కడ కిలో నిమ్మకాయల ధర రూ. 400కు చేరడమే. ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉన్న రాజస్థాన్‌లో నిమ్మ సాగు తక్కువ. దీనికి తోడు పెట్రో ధరలు పెరుగడంతో రవాణా ఛార్జీలు తడిసిమోపెడు అవుతాయన్న కారణంతో వ్యాపారులు ఇతర రాష్ర్టాల నుంచి నిమ్మకాయల దిగుమతులను తగ్గించారు. దీంతో నిమ్మకాయ ధర కొండెక్కింది.