Hollywood News | హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ (Sydney Sweeney) తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఆమె తన కొత్త లాంజేరీ (Lingerie) బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒక సాహసం చేయగా.. ఆ స్టంట్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. లాస్ ఏంజెల్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధ ‘హాలీవుడ్’ (Hollywood) సైన్ బోర్డుపైకి ఎక్కి, అక్కడ బ్రాలను వరుసగా వేలాడదీయడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. తన బ్రాండ్ ప్రచారం కోసం అర్థరాత్రి సమయంలో టీమ్‌తో కలిసి హాలీవుడ్ కొండపైకి వెళ్లిన ఆమె, అక్కడి భారీ అక్షరాలలో ఒకదానిపైకి ఎక్కి ఈ పని చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ ప్రాంతంలో షూటింగ్ చేసుకోవడానికి ఆమెకు అనుమతి ఉన్నప్పటికీ, ఐకానిక్ హాలీవుడ్ బోర్డును తాకడానికి లేదా దానిపైకి ఎక్కడానికి హాలీవుడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని సమాచారం. దీంతో నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ ఆస్తిపైకి ఎక్కినందుకు గాను ఆమెపై క్రిమినల్ ట్రెస్పాస్(Criminal Tresspass) కింద కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
According to TMZ, Sydney Sweeney could face vandalism charges after climbing the Hollywood sign and hanging bras on it to promote her new lingerie brand, SYRN. pic.twitter.com/uJb5p6PBdM
— Sydney Sweeney Daily (@sweeneydailyx) January 26, 2026