Vijay Devarakonda | విజయ్ దేవరకొండ కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ‘రణబాలి’ టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ వీడియోలోని అద్భుతమైన విజువల్స్ చూసి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించినదని పలు జర్నలిస్ట్‌లతో పాటు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వార్తలపై దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ స్పందిస్తూ.. ‘రణబాలి’ గ్లింప్స్‌లో ఎక్కడా AI వాడలేదని స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇందులోని ప్రతి ఫ్రేమ్‌ను సాంకేతిక బృందం ఎంతో కష్టపడి సంప్రదాయ పద్ధతుల్లోనే డిజైన్ చేసిందని, కేవలం ఈ చిన్న వీడియో కోసమే తమ టీమ్ కొన్ని నెలల పాటు శ్రమించిందని ఆయన వెల్లడించారు.
‘టాక్సీవాలా’ తర్వాత రాహుల్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామా 1854 – 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలం నాటి వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటిస్తుండగా, అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ దేవరకొండను ఒక వీరుడిలా చూపిస్తూ భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది.
Thank you @idlebrainjeevi garu 🙏🏻.
But AI was not used, every frame was worked in older ways- invested months of time. https://t.co/fXQpLHJKAZ— Rahul Sankrityan (@Rahul_Sankrityn) January 26, 2026