Varun Dhawan |బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘బోర్డర్ 2’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అయితే ఆ ఉత్సాహం కాస్త ఎక్కువైందా అన్నట్టుగా, అతడి తాజా మెట్రో ప్రయాణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబై మెట్రోలో ప్రయాణించిన వరుణ్… రైల్లో చేసిన విన్యాసాలు మాత్రం మెట్రో అధికారుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ముంబై ట్రాఫిక్‌ను తప్పించుకుని, అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వరుణ్ ధావన్ మెట్రోలో థియేటర్‌కు వెళ్లాడు. ఈ ప్రయాణాన్ని ముందుగానే సోషల్ మీడియాలో టీజ్ చేస్తూ, “నేను ఏ థియేటర్‌కు వెళ్తున్నాను?” అంటూ స్టోరీ పోస్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత మెట్రో కోచ్‌లో పైభాగంలో ఉన్న మెటల్ రాడ్‌ను పట్టుకుని పుల్-అప్స్ చేస్తూ కనిపించాడు. చుట్టూ సాధారణ ప్రయాణికులు ఉండగానే ఇలా స్టంట్స్ చేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.
ఈ వీడియోలు వైరల్ కావడంతో ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMMOCL) వెంటనే స్పందించింది. వరుణ్ వీడియోను తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ, స్ట్రిక్ట్ అడ్వైజరీని జతచేసింది. సినిమాల్లో కనిపించే డిస్క్లైమర్ల మాదిరిగా, “ఇది రీల్ లైఫ్… రియల్ లైఫ్‌లో అనుకరించవద్దు” అనే సందేశం ఇవ్వాల్సిందిగా సూచించింది. మెట్రో కోచ్‌లలో ఉన్న గ్రాబ్ హ్యాండిల్స్, మెటల్ రాడ్స్ అన్నీ ప్రయాణికుల భద్రత కోసం మాత్రమే. అవి ఫిట్నెస్ స్టంట్స్ లేదా విన్యాసాల కోసం కావు. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్, 2002 ప్రకారం ఇలాంటి ప్రవర్తన ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే లేదా ఆస్తికి నష్టం కలిగిస్తే శిక్షార్హులు. అవసరమైతే జరిమానాలు లేదా జైలు శిక్ష కూడా పడొచ్చు” అని హెచ్చరించింది.
చివరగా, కొంచెం హ్యూమర్ మిక్స్ చేస్తూ మెట్రో చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . “హ్యాంగ్ అవుట్ చేయండి… కానీ మెట్రోలో వేలాడకండి!” అని తెలిపింది. ఈ ఘటనతో సెలబ్రిటీలైనా సరే, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో నిబంధనలు అందరికీ ఒకటేనన్న సందేశం మరోసారి బలంగా వెళ్లింది.
View this post on Instagram
A post shared by Maha Mumbai Metro Operation Corporation Limited (@official_mmmocl)