హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పెట్టడం సరికాదని, వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం ఎంబీభవన్‌లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 20 బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వామపక్ష నాయకులు, ప్రగతిశీల మేధావులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
21న ఉదయం 10గంటలకు పెద్దఎత్తున జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.