అజ్ఞాతవాసి చిత్రం తర్వాత దాదాపు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ..వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం అందించడమే కాక బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్నిఅందుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు,సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రాలు చేయనున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలోను ఓ మూవీ చేయనున్నాడు.
అయితే పవన్ సినిమాలకు లీకులు బెడద ఎక్కువైంది. వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ సమయంలో పవన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. యాక్షన్ సీన్‌కు సంబంధించిన సన్నివేశాలు ఇందులో ఉండగా, పవన్ ఎదురుగా మల్లయోధులు కుస్తీకి సిద్దపడుతున్నట్టు కనిపిస్తుంది . తొలిసారి పవన్ చారిత్రాత్మక చిత్రం చేస్తుండడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.