చంపాపేట, ఏప్రిల్ 23 : ఈ నెల 27 వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు కదలిరావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని 11 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా చంపాపేట గాంధీ బొమ్మ చౌరస్తా, కర్మన్ఘాట్, బైరమల్గూడలో గులాబీ జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను మరింత పటిష్టపరిచేందుకు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 27న వరంగల్లో పార్టీ జన జాతర సభను నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా పార్టీ శ్రేణులందరూ సభకు భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. సభకు కేసిఆర్ హాజరై భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు చేయాల్సిన కృషి ఏవిధంగా ఉండాలో కూడా సభలో ప్రసంగిస్తారని అన్నారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుడు అందరూ హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.