‘పర్వతాన్ని అధిరోహిస్తే సరిపోదు..అక్కడి నుంచి ఈ విశాల ప్రపంచంలోని అందాల్ని కూడా వీక్షించే హృదయం ఉండాలి’ అని చెబుతున్నది అందాల నాయిక లావణ్య త్రిపాఠి. సినీరంగంలో పోటీతత్వాన్ని తాను పట్టించుకోనని, మనసుకు నచ్చిన విధంగా కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటానని స్పష్టం చేసింది. సినిమా షూటింగ్స్‌కు కాస్త బ్రేక్‌నిచ్చిన ఈ సొగసరి ఇటీవల గోవాలో స్నేహితులతో కలిసి ఖాళీ సమయాన్ని ఆస్వాదించింది. తన కెరీర్ గురించి ఎప్పుడూ ఒత్తిడికి లోనుకానని, ఓ సినిమా పూర్తయిన వెంటనే తర్వాత ఏంటనే ప్రశ్న గురించి అస్సలు ఆలోచించనని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌కు ముందు నేను నటించిన సినిమాలు వరుసగా రిలీజయ్యాయి. అందుకే ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నా. నిరంతరం వృత్తికే అంకితమైపోయి జీవితంలోని ఆనందాల్ని వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను తరచు విహారాలకు వెళ్తుంటా. స్వీయ అన్వేషణకు అవి ఎంతగానో దోహదపడతాయి’ అని చెప్పుకొచ్చింది.