అమరావతి : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం(Communication Satilite) సీఎంఎస్-3ను రేపు ( ఆదివారం) నింగిలోకి పంపనున్నది. ఇండియన్ నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఏపీలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (Satishdawan Space Centre) నుంచి ప్రయోగించనున్నారు. దీని బరువు దాదాపు 4,400 కిలోల వరకు ఉంటుంది. ఇస్రో తొలిసారిగా భారీ బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్‌ను భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుండడం విశేషం. వాయిస్, డేటా, వీడియో లింక్‌ల కోసం సీ, ఎక్స్టెండెడ్ సీ, క్యూ-బ్యాండ్స్‌లో కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్( Chairman Narayanan) శనివారం ఇస్రో బృందంతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఎల్వీఎం-3, సీఎంఎస్ 3 మిషన్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం ప్రయోగనించనున్న బహుబలి రాకేట్ అని తెలిపారు. భారత్ కమ్యూనికేషన్ల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.