హైదరాబాద్ : భాగ్యనగరాన్ని తలచుకోగానే ముందుగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. హుస్సేన్ సాగర్ మధ్యలో ఉండే అతి పెద్ద బుద్ధ విగ్రహం సాయం సాయంత్రం విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతూ ఆకట్టుకుంటుంది. ఇటీవల ట్యాంక్‌బండ్ పరిసరాలను ప్రభుత్వం మరింత అందంగా తీర్చిదిద్దడంతో నగర వాసులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతోంది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు వాహనాలను మళ్లించి కేవలం సందర్శలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. దీంతో ఆదివారం వచ్చిదంటే చాలు ట్యాంక్‌బండ్ పరిసరాలు సందడిగా కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆదివారం వేలాది మంది సందర్శకులతో ట్యాంక్‌బండ్ నిండిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కార్నివాల్ కంటే ఎక్కువ సందడి ట్యాంక్‌బండ్‌పై ఉంది. ఇక్కడ పిల్లలకు సంబంధించిన మరిన్ని కార్యకలాపాలను ప్రారంభిద్దాం. కళలు, చేతితో చేసిన క్రాప్ట్స్, సంగీతం లాంటివి ఒక మ్యాజికల్ అనుభూతిని ఇస్తాయి. హుస్సేన్ సాగర్ సరస్సులో లేజర్‌షో, అన్ని వైపులా సందర్శకుల గ్యాలరీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి’ అని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు ట్విట్టర్ ద్వారా సూచించారు.
Doesn’t that look more like a carnival on #TankBund 😊
— KTR (@KTRTRS) September 6, 2021
Let’s start more kids oriented activities @arvindkumar_ias
Arts+Crafts+Music will create a Magical experience
Let’s explore a laser show in the lake & some viewer galleries on all sides pic.twitter.com/2s3BjWpAnR