ఒకేసారి పెద్ద సంఖ్యలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేస్తుంటాం. దీంతో వాట్సాప్ వినియోగదారులకు స్టోరేజ్ సమస్యలు రావడం చాలా సహజం. ముఖ్యంగా గ్రూప్ చాట్లు, అనవసరమైన ఫార్వర్డ్ మెసేజ్‌లు స్టోరేజ్ ఫుల్ అయ్యేలా చేస్తాయి. ఫలితంగా ఫోన్ పనితీరు మందగిస్తుంది. కొత్త ఫైల్స్ స్టోర్ చేయడానికి స్థలం ఉండదు.
వాట్సాప్ స్టోరేజ్‌ను సమర్థంగా నిర్వహిస్తే.. సగం సమస్య పరిష్కారం అయినట్టే. ఇందుకోసం మొదట మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌కు వెళ్లండి. అక్కడ స్టోరేజ్ అండ్ డేటాను ఎంచుకోవాలి. అందులో మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. అప్పుడు ‘లార్జ్ ఫైల్స్’, ‘ఫార్వర్డ్ మెనీ టైమ్స్’ కేటగిరీలు చూడొచ్చు. ఫైల్స్‌ను త్వరగా గుర్తించడానికి లార్జెస్ట్ ద్వారా సార్టింగ్ చేయండి.
ఎక్కువ స్థలం ఆక్రమిస్తున్న ఫైళ్లను సులభంగా గుర్తించవచ్చు. మీరు తొలగించదలచిన ఫైల్‌ను ఎంచుకుని, డిలిట్ చేసేయొచ్చు. అలాగే, గ్రూప్‌లోని మెసేజ్‌లన్నీ ఒకేసారి క్లియర్ చేయడానికి, ప్రత్యేక చాట్ క్లీనప్ ఆప్షన్‌ను కూడా వినియోగించుకోవచ్చు.