Terror financing case | హఫీజ్ సయీద్ అనుచరులను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
Terror financing | ఉగ్రవాదులకు నిధుల (Terror financing) కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అనుచరులను పాకిస్థాన్‌లోని లాహోర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

లాహోర్: ఉగ్రవాదులకు నిధుల (Terror financing) కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అనుచరులను పాకిస్థాన్‌లోని లాహోర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత జమాతుద్ దవా (JUD)కు చెందిన ఆరుగురు నేతలను నిర్దోషులుగా తీర్పునిచ్చింది. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలో జేయూడీ పనిచేస్తున్నది. ఇది లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థగా కొనసాగుతున్నది. ముంబై దాడుల్లో 160 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్‌లో లాహోర్ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జేయూడీకి చెందిన ఐదుగురు అగ్రనేతలకు తొమ్మిదేండ్ల జైలు శిక్ష విధించింది. వారిలో మాలిక్ జాఫర్ ఇక్బాల్, యాహ్యా ముజాహిద్, నసారుల్లాహ్, సమియుల్లాహ్, ఉమర్ బహదూర్ ఉన్నారు. హఫీజ్ సయిద్ బావమర్ధి అయిన హఫీజ్ అబ్దుల్ రహ్మన్ మక్కికి ఆరు నెలల శిక్ష విధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

