హైదరాబాద్: లగ్ జా గలే.. బహుశా ఈ పాటను ఎంజాయ్ చేయనివారుండరేమో…
వాట్ ఏ రొమాంటిక్ వాయిస్. ఎమోషన్ ఏదైనా లతాజీ తన స్వరంతో ఆ టేస్ట్ చూపించారు…
బాలీవుడ్ ఫిల్మీ సాంగ్స్‌లో లగ్ జా గలే పాట ఓ సూపర్ హిట్. లతా మంగేష్కర్ ఆ పాటకు స్వరం అందించిన తీరు అమరం…
1964లో రిలీజైన వో కౌన్ తీ ఫిల్మ్‌లో పాడిన లగ్ జా గలే పాట ఆ నాటి తరానికి ఆణిముత్యం. అప్పుడే కాదు.. ఇప్పటికీ ఆ సాంగ్ ఎందరో సింగర్లకు గీటురాయి. మదన్ మోహన్ ఆ పాటకు సంగీతాన్ని అందించారు. రాజా మెహిది అలీ ఖాన్ ఆ పాట రాశారు. బాలీవుడ్ హిస్టరీలో ఇదో పాపులర్ సాంగ్. లతాజీ ఆల్బమ్‌లోనూ ఇదే టాప్ అన్నా ఆశ్చర్యంలేదు. ఆ సాంగ్‌లో లతా వాయిస్ మాడ్యులేషన్స్ ఓ మ్యూజిక్ థ్రిల్. ఎమోషన్స్‌పై ఆమెకు ఉన్న కంట్రోల్ అద్భుతం. స్వరాన్ని రొమాంటిక్‌గా వినిపించిన ఆమె ట్యాలెంట్ బ్రిలియంట్.
లగ్ జా గలే.. కే పిర్ హసీ రాత్ హోనా హో.. షాయద్ ఫిర్ ఇస్ జనమ్ ములాకత్ నా హో.. అద్భుతమైన సాహిత్య విలువలు ఉన్న ఈ రొమాంటిక్ సాంగ్‌ను లతా మంగేష్కర్ తన వాయిస్‌తో సినీ ప్రేక్షకులకు ఓ వైబ్రేషన్ తీసుకువచ్చింది. హమ్కో మిలీ హై ఆజ్ గడియా నసీబ్ సే.. జీ బర్ దేక్ లీ జియే.. హమ్ కో కరీబ్ సే అంటూ లతాజీ తన స్వరంతో హావభావాలు పలికిన తీరు అలౌకికం. పిర్ ఆప్ కే నసీబ్ మే ఏ బాత్ నా హోనా హో.. పాస్ ఆయియే కే హమ్ నహీ.. ఆయింగీ బార్ బార్.. అంటూ లతాజీ మనల్ని వదిలి వెళ్లినా.. ఆమె పాటలు మాత్రం భారతీయులకు ఎప్పటికీ వీనులవిందే. బాహే గలేమే డాల్కే.. హమ్ ఆంకేంసో ఫిర్ యే ప్యార్ కీ బర్షాత్ హోనా హో.. అని ఆ సాంగ్‌లో హీరోయిన్ విరహవేదనను లతా మంగేష్కర్ తన గానంతో విలపించిన తీరు ఓ వెలకట్టలేని ఎమోషన్.
లతాజీ స్వరంలో ఉన్న స్వచ్ఛత.. స్పష్టత బహుశా మరో సింగర్లో లేదాన్న అతిశయం కాదు. ఇక ఆమె పిచ్‌పై ఆమెకు ఉన్న పట్టు.. అది ఆమె అసెట్. క్యారెక్టర్లో ఉండే ఎమోషన్స్‌ను ఆమె తన స్వరంతో వినిపించి సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇంతటి ట్యాలెంట్ ఉన్న గాయని .. ఇండియన్ లెజెండ్ అని చెప్పడం అనివార్యమే అవుతంది. బ్రీత్ కంట్రోలింగ్‌లో లతాజీ అగ్రశ్రేణి సింగర్. శ్వాసను లయబద్ధంగా వదులుతూ.. తన గాత్రాన్ని రమణీయంగా ప్రజెంట్ చేసేది. సంగీత దర్శకులు ఇచ్చే నోట్స్‌ను లతాజీ చాలా ఈజీగా పట్టేసేది. స్వీట్ వాయిస్‌తో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తీయటి స్వరం ముందు ఆనాటి సింగర్లు చాలా మంది తెరమరుగైపోయారు.
బ్యాక్‌గ్రౌండ్ సింగింగ్‌లో లతాజీని అందరూ మహారాణి.. హై కమాండ్ అంటూ పిలిచేవారు. నిజానికి ఆ స్థాయికి తగ్గట్లే ఆమె ప్రతి పాటను పాడారు. లతాజీ పాడితే రికార్డింగ్ టెక్నీషియన్లకు ఎక్కవ పని ఉండేది కాదట. అంత కచ్చితంగా మంగేష్కర్ పాట ఆలపించేది. లగ్ జా గలే పాటలో అతి కష్టమైన రొమాంటిక్ ఎమోషన్‌ను.. లతా మంగేష్కర్ ఎంతో సరళంగా, సున్నితంగా వినిపించారు. ఎన్నో ఎవర్గ్రీన్ పాటలు పాడిన స్వర కోకిల లతాజీ సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ ఇవాళ తిరిగిరాని అమరలోకాలకు వెళ్లిపోయారు.
.