– రూ.30,116 నగదు పారితోషికంతో ఘన సత్కారం
– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారం ప్రదానం
రామగిరి, అక్టోబర్ 03 : చిత్రకళా రంగంలో విశిష్ట సేవలు అందించిన నల్లగొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కూరెళ్ల శ్రీనివాస్‌కు ప్రతిభా పురస్కారం లభించింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై చిత్రలేఖన విభాగంలో ఎంపికైన కూరెళ్ల శ్రీనివాస్‌ను రూ.30,116 నగదు పారితోషికంతో ఘనంగా సత్కరించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు సభకు అధ్యక్షత వహించారు.
కూరెళ్ల శ్రీనివాస్ కు పురస్కారం రావడంతో విశ్వకర్మ తేజస్సుని వ్యవస్థాపకుడు పెందోట సోము, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరి చారి, కోశాధికారి తరుణ్ రోజు భీష్మచార్య, గౌరవ అధ్యక్షుడు కొండోజు కృష్ణమాచారి, శ్రీపాద కృష్ణమాచారి, ప్రచార కార్యదర్శి బొడ్డుపల్లి రామకృష్ణ, ప్రముఖ కవులు రచయితలు పెరుమల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, బండారు శంకర్, డాక్టర్ ఈడుకోజు శ్రీనివాసా చారి హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.