హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లు, భూ ము ల జోలికొస్తే ఊర్కొనేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బస్తీబాటలో భాగంగా ఆ దివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో పర్యటించి బ స్తీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ.. పేదల కోసం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే.. గుంపు మేస్త్రీనని చె ప్పుకొంటున్న రేవంత్ మాత్రం ఆ ఇండ్ల ను కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశా రు. పేదల ఇండ్లను కూల్చడం.. భూములను లాక్కోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పా లన సాగుతున్నదని దుయ్యబట్టారు.
మూ సీ సుందరీకరణ పేరిట మూసీతో సంబం ధం లేని హనుమాన్నగర్ను ఖాళీ చే యించే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలు అధైర్యపడొద్దని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. హనుమాన్‌నగర్ ప్రజలకు నివాస హ క్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.