జిగితారా..జిగితారా.. దిగినావా మనసారా
‘దర్శకుడు రవి నంబూరి రచనాశైలి నన్ను భావోద్వేగానికి లోనుచేసింది. నా జీవితాన్ని దగ్గరగా చూసి రాశాడా! అనిపించింది. ‘చెన్నైలవ్ స్టోరీ’ సినిమాలోని సంభాషణలు చాలా ఏళ్లు గుర్తుంటాయి.
‘దర్శకుడు రవి నంబూరి రచనాశైలి నన్ను భావోద్వేగానికి లోనుచేసింది. నా జీవితాన్ని దగ్గరగా చూసి రాశాడా! అనిపించింది. ‘చెన్నైలవ్ స్టోరీ’ సినిమాలోని సంభాషణలు చాలా ఏళ్లు గుర్తుంటాయి. సాయిరాజేశ్ ఈ కథ చెప్పినప్పుడు హార్ట్ టచింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో స్టీవెన్ రోల్ చేయడం పట్ల చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. గౌరీప్రియతో నటించడం గొప్ప అనుభవం. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరొస్తుంది. ఇక ఈ రోజు రిలీజ్ చేసిన ‘జిగితార’ సాంగ్‌కి ముందు లీడ్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. పాట కూడా అద్భుతంగా ఉంటుంది. తిరుపతిలో శ్రీవారి పాదాల సాక్షిగా చెబుతున్నా ‘చెన్నై లవ్‌స్టోరీ’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’ అని కిరణ్ అబ్బవరం నమ్మకంగా చెప్పారు.
ఆయన, శ్రీగౌరీప్రియ జంటగా నటించిన యువతరం ప్రేమకథ ‘చెన్నై లవ్‌స్టోరీ’. రవి నంబూరి దర్శకుడు. సాయిరాజేశ్ కథ అందించడంతోపాటు ఎస్కేఎన్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ఈ సినిమా మ్యూజికల్ ఫెస్ట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ఇంకా డైరెక్టర్ రవి నంబూరి, కథానాయిక శ్రీగౌరీప్రియ, నిర్మాతలు ఎస్కేఎన్, సాయిరాజేశ్, చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ, గీత రచయిత అనంతశ్రీరామ్, నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ‘జిగితారా..జిగితారా… దిగినావా.. మనసారా..’ అంటూ సాగే సినిమాలోని తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. కార్తీక్ ఈ పాటను ఆలపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

