రోత భాష ఏందీ రేవంత్?
సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, సాగునీటి సమస్యలను పట్టించుకోకుండా సీఎం బాధ్యతారహితమైన భాష మాట్లాడుతున్నారని విమర్శించారు.
- కరువు, కన్నీళ్లతో బాధపడుతుంటే చిల్లర మాటలతో చిందులా?
- జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహికి అమరవీరుల గురించి మాట్లాడే అర్హత లేదు
- ప్రతి నియోజకవర్గం సిద్దిపేట, సిరిసిల్లలా గర్జించి కాంగ్రెస్‌కు సమాధి కట్టడం ఖాయం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, సాగునీటి సమస్యలను పట్టించుకోకుండా సీఎం బాధ్యతారహితమైన భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. కరువు, కన్నీళ్లతో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చిల్లర మాటలతో చిందులు తొకడం ఏందని ప్రశ్నించారు. తెలంగాణలో నీళ్ల దోపిడీ జరుగుతుంటే నిద్ర నటిస్తూ, వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్న వారిపై నిందలు మోపడం ఏమిటని గురువారం ఎక్స్‌లో ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత విస్మరించి, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జై తెలంగాణ అని అనలేని ఉద్యమద్రోహి రేవంత్‌రెడ్డికి తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత ఎకడిదని ప్రశ్నించారు.
పథకాలకు పాతర.. అవినీతి జాతర
నిన్న సిరిసిల్ల, నేడు సిద్దిపేటలో పనికిమాలిన ప్రేలాపనలు చేయడం మినహా ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేస్తున్న మేలు ఏమిటని కేటీఆర్ విమర్శించారు. బాధ్యతగల ముఖ్యమంత్రి ప్రజలకు నాలుగు మంచి పనులు, మంచి మాటలు చెప్పాలని, కానీ రేవంత్‌రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పథకాలకు పాతరేస్తూ, అవినీతి జాతర కొనసాగిస్తూ అబద్ధాలు, అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం దగ్గరపడిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి నియోజకవర్గం సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో గర్జించి కాంగ్రెస్‌కు సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ఉద్యమ శిఖరం కేసీఆర్‌ను దూషించి పైశాచికానందం పొందడం తప్ప మరేమీ చేయలేరని విమర్శించారు. కేసీఆర్‌ను కల్పవృక్షంగా అభివర్ణిస్తూ, రేవంత్‌రెడ్డి ఒక కలుపు మొక అంటూ విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

