KTR | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటూ దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాలను కోరుతున్న బీజేపీ.. తమ వారి విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు.
పోక్సో చట్టం ఒక్కటే అయినప్పటికీ కేంద్రమంత్రుల పిల్లలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయం అమలు చేయడాన్ని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసును నీరుగార్చేందుకు పోలీసులు తొలుత ఇతర సెక్షన్లను పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
One Nation – One Tax
One Nation – One ElectionBJP wants uniformity in all things
But when it comes to shielding their kith and kin;
One POCSO Act – But two standards; one for Union Minister’s Son and another for a common man#POCSO #BetiBachao pic.twitter.com/wJQRQvyP7e
— KTR (@KTRBRS) May 13, 2026