నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ( Nizamabad District) బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జీలతో ప్రత్యేక సమావేశం అయ్యారు.

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియతో పాటు, పలు అంశాలపై నేతలతో కేటీఆర్ చర్చించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, సురేందర్, బిగాల గణేష్‌గుప్తా , హన్మంత్ షిండే తదితరులున్నారు.