AAP-RJD press meet | ఆప్-ఆర్జేడీ ప్రెస్మీట్లో పాల్గొన్న మాజీ సైనికులు.. అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: ఆర్మీ
AAP-RJD press meet | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆర్జేడీ సంయుక్త ప్రెస్మీట్లో పాల్గొన్న యూనిఫామ్‌లో కనిపించిన వ్యక్తులు మాజీ సైనికులని ఆర్మీ తెలిపింది. సర్వీస్ నుంచి తొలగించిన ఆ వ్యక్తులు ఆర్మీ గురించి అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆర్జేడీ సంయుక్త ప్రెస్మీట్లో పాల్గొన్న యూనిఫామ్‌లో కనిపించిన వ్యక్తులు మాజీ సైనికులని ఆర్మీ తెలిపింది. సర్వీస్ నుంచి తొలగించిన ఆ వ్యక్తులు ఆర్మీ గురించి అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. (AAP-RJD press meet) ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నలుగురు మాజీ సైనికులు పాల్గొన్నారు. సర్వీస్ నుంచి తమను తొలగించడంపై పలు ఆరోపణలు చేశారు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలపై ఆర్మీ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘వీడియోలో కనిపించిన చందు చవాన్, హరేంద్ర యాదవ్, పీ నరేందర్‌లను క్రమశిక్షణారాహిత్యం, సైనికోచిత ప్రవర్తన కారణంగా సర్వీస్ నుంచి తొలగించినట్లు పునరుద్ఘాటిస్తున్నాం. నాల్గవ వ్యక్తి శంకర్ సింగ్ గుజ్జర్ 2024 నవంబర్ నుంచి పలాయనం చేసిన సైనికుడు. అతడిపై సైనిక, సివిల్ కోర్టులలో క్రమశిక్షణా చర్యలు కొనసాగుతున్నాయి’ అని ఆర్మీ తెలిపింది.
మరోవైపు సర్వీస్ నుంచి తొలగించిన ఆ మాజీ సైనికులు అసత్య, దురుద్దేశపూరిత, తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచారం చేస్తున్నరని ఆర్మీ ఆరోపించింది. సైన్యం గురించి అబద్ధాలు చెబుతున్నారని, అధికారులు-సైనికుల మధ్య విభేదాలు సృష్టించి రెచ్చగొట్టడం ద్వారా ఆర్మీలో చీలికలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తద్వారా సైన్యం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.
అలాగే తమ దుష్ప్రవర్తన, సర్వీస్ నుంచి తొలగింపుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆ నలుగురు మాజీ సైనికులు ఉద్దేశపూర్వకంగా ‘నకిలీ, దురుద్దేశపూరిత, తప్పుదోవ పట్టించే కథనాలను’ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఆర్మీ ఆరోపించింది. పలాయనం, మత్తు, అవిధేయతకు సంబంధించిన కొనసాగుతున్న కేసులు, ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే వారి కథనాల లక్ష్యమని విమర్శించింది. ‘పౌరులు ఇటువంటి ప్రచారానికి బలికావద్దని, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
अफवाहों से बचें#FakeAlert #Beware
A press conference video is being circulated across media and social media platforms with an attempt to malign the image of the #IndianArmy.
It is reiterated that the individuals seen in the video, namely Chandu Chavan, Harendra Yadav and P… pic.twitter.com/IJfWoWj9Zo
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

