KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
KTR | బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు.
KTR | బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటని నిలదీశారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెప్పాలని, పోలీసు కేసులతో అణచివేయాలని చూడటం సరికాదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భార్య ఇందుజా రెడ్డి ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాలరాజు యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ అరెస్టుపై తాజాగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను నగరమంతా తిప్పుతూ ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని విమర్శించారు. రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదని హితవు పలికారు.
అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. బాలరాజు యాదవ్‌పై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతలను ప్రశ్నించే హక్కును కాలరాయలేరని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భార్య ఇందుజా రెడ్డి ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు మేరకు అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు
కేటీఆర్, హరీశ్‌రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్మూరి వెంకట్‌పై మీడియా సమావేశంలో మాట్లాడినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన దూదిమెట్ల బాలరాజు యాదవ్
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

