ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
తమకు స్టైపెండ్ పెంచాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న విదేశీ వైద్య విద్యార్థుల (FMG) ఇంటర్న్‌లపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు.
తమకు స్టైపెండ్ పెంచాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న విదేశీ వైద్య విద్యార్థుల (FMG) ఇంటర్న్‌లపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమకు నెలకు రూ.29,792 స్టైఫండ్ చెల్లించాలని, జనవరి 2026 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల పరిధిలోని బోధనాసుపత్రుల్లో ఎఫ్ఎంజీ ఇంటర్న్లు విధులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులతో సమానంగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ తమకు నెలకు కేవలం రూ.5 వేల స్టైపెండ్ మాత్రమే చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర వైద్య ఇంటర్న్లతో సమానంగా రూ.29,792 చెల్లించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం విదేశీ వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళన శుక్రవారానికి 30వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం సమీపంలో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. శుక్రవారం రెండో రోజు కూడా రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ క్రమంలో డీఎంఈ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
జనవరి 2026 నుంచి పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, ఇంటర్న్‌షిప్ పొడిగింపు పేరుతో ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఎఫ్ఎంజీ వైద్యులు కోరుతున్నారు. తమపై ఎలాంటి కక్షపూరిత చర్యలు తీసుకోకూడదని, స్థానిక ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైపెండ్ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులతో ఈ అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఎఫ్ఎంజీ ఇంటర్న్‌ల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని వైద్యులు, వైద్య రంగానికి చెందిన పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
FMG వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం
కోఠిలోని DME కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులను ఈడ్చుకెళ్లి, అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమకు రూ.29,792 స్టైపెండ్ ఇవ్వాలని, జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని ఆందోళన https://t.co/qCccgo2Y3l
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

