పుణె: టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్‌తో మొదటి వన్డే మ్యాచ్‌కు అతడితో పాటు కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణ వన్డే క్యాప్ అందుకున్నారు. ప్రసిద్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఏడాది ఆరంభంలో పాండ్య సోదరులు తమ తండ్రిని కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ నుంచి క్యాప్ అందుకున్న కృనాల్ తన తండ్రిని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లు అభినందనలు తెలిపిన తర్వాత హార్డిక్..కృనాల్‌ను హత్తుకొని ఓదార్చాడు.
ODI debut for @krunalpandya24 👌
— BCCI (@BCCI) March 23, 2021
International debut for @prasidh43 👍#TeamIndia @Paytm #INDvENG pic.twitter.com/Hm9abtwW0g
There's something in my eye..
— Wasim Jaffer (@WasimJaffer14) March 23, 2021
Go well @krunalpandya24 #INDvENG pic.twitter.com/24EMgdnS8A