Kriti Sanon | మహేష్‌బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్. అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ సినిమా రీమేక్‌తో హిందీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుస విజయాలతో లక్కీ గాళ్ అనిపించుకుంది. తాజాగా ‘క్రూ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇటీవల మీడియాతో ఆమె పంచుకున్న కబుర్లు వైరల్ అవుతున్నాయి. ‘రిలేషన్షిప్ అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు సాధారణమే. అయితే, గొడవ జరిగినప్పుడు నా తప్పు ఉంటే తప్పకుండా నేనే సారీ చెబుతాను. నా తప్పు లేకుంటే సారీ చెప్పను. ఏది ఏమైనా ఆ సమస్యను పరిష్కరించుకొని రిలేషన్‌ను కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తా! ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు కన్నీళ్లు రావు అని అబద్ధం చెప్పను.
అలాగని ప్రతి దానికీ ఏడుస్తూ కూర్చోను. తట్టుకోలేనంత బాధయితే మాత్రం ఏడ్చేస్తా! నా అనుకున్నవాళ్లతో గొడవైతే మాత్రం వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయి. నాకు సినిమా అంటే ఇష్టం. ఈ రంగంలోనే కొనసాగాలని అనుకుంటున్నా. వర్క్‌లైఫ్ బిజీగా ఉండటమే నిజమైన ఆనందం’ అంటున్నది కృతి సనన్.