Krishna Vrinda Vihari On OTT | టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఇటీవలే ఈయన నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. అనీష్ ఆర్.కృష్ణ దర్వకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న రిలీజైంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోపే థియేటర్లలో నుండి వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 23న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా షిర్లే సేతియా హీరోయిన్గా నటించింది. స్వర మాంత్రికుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను నాగశౌర్య హోం బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మించారు.