హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి తనపై పరకాల నుంచి పోటీకి రావాలని కొండా సుస్మిత సంచలన సవాల్ విసిరారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి లక్కీగా సీఎం అయ్యారని ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవంటూ చురకలంటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో ‘కొడుకు తప్పు చేస్తే తండ్రిని అరెస్ట్ చేయాలా?’ అని నాడు ఇదే సీఎం రేవంత్ ప్రశ్నించారని గుర్తుచేశారు.
తన తల్లి విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా ప్రభుత్వంతో కొండల్‌రెడ్డి రూ.3వేల కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు తమకు తెలిసిందని పేర్కొన్నారు. పదో తరగతి చదువుతున్న తన కూతురితో కొండల్‌రెడ్డి ఇంగ్లిష్‌లో మాట్లాడగలరా? అని సుస్మిత చాలెంజ్ చేశారు. ఇంగ్లిష్ మాట్లాడరాని వ్యక్తి ఏకంగా ఎయిర్‌ఫోర్స్ కంపెనీ పెట్టడం ఏమిటని మండిపడ్డారు.