GT vs KKR : పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) నిలిచింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు షాకిస్తూ కీలకమైన రెండు పాయింట్లు సాధించింది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో ఫిన్ అలెన్(93), రఘువంశీ(82 నాటౌట్)లు తుఫాన్ ఇన్నింగ్స్‌తో 247 రన్స్ కొట్టిన కోల్‌కతా.. ఆపై ప్రత్యర్థిని కట్టడి చేసింది. శుభ్‌మన్ గిల్(85), బట్లర్() అర్ధశతకాలతో పోరాడినా సరిపోలేదు. ఈ విజయంతో రహానే బృందం ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
ఐపీఎల్ 19లో ప్లే ఆఫ్స్ రేసు రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. ఇక కష్టమే అనుకున్న జట్లు సంచలన విజయాలతో ముందున్న జట్లకు షాకిస్తున్నాయి. మొన్న ముంబై ఇండియన్స్, నిన్న లక్నో సూపర్ జెయింట్స్ .. ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీతో నాకౌట్ పోరును ఉత్కంఠగా మార్చేశాయి. తొలుత గుజరాత్ బౌలర్ల భరతం పడుతూ ఓపెనర్ ఫిన్ అలెన్(93), రఘువంశీ(82 నాటౌట్)లు భారీ స్కోరందించగా.. అనంతరం బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు.
భారీ ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్(23) శుభ్‌మన్ గిల్(85) దూకుడుగా ఆడారు. కానీ, బంతి చేతికి తగిలి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. నిశాంత్ సింధు(1)ను నరైన్ ఔట్ చేశాడు. జోస్ బట్లర్(57) గిల్ గెలుపు బాధ్యత తీసుకున్నారు. బౌండరీలతో చెలరేగిన కెప్టెన్ 33 బంతుల్లో అర్ధ శతకం అందుకోగా.. బట్లర్ సైతం బాదేశాడు. శతక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని నరైన్ విడదీశాడు. అప్పటికీ గుజరాత్ విజయానికి 22 బంతుల్లో 71 పరుగులు కావాలి. తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన సుదర్శన్, బట్లర్‌తో కలిసి ప్రయత్నించినా గుజరాత్‌ను గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో 40 రన్స్ అవసరమవ్వగా.. గుజరాత్ 218కే పరిమితమైంది.
1️⃣0️⃣0️⃣-run stand
Big target but Jos Buttler and Shubman Gill are stepping up for #GT 👏👏
Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/z05AUmdBXl
— IndianPremierLeague (@IPL) May 16, 2026
కోల్‌కతాను ఆదిలోనే దెబ్బకొట్టాడు సిరాజ్. ఓపెనర్ రహానే(14)ను బౌల్డ్ చేసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత ఫిన్ అలెన్(93) రెచ్చిపోయాడు. రషీద్ ఖాన్ ఓవర్లో తొలి మూడు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. 14, 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించడంతో అర్ధ శతకం బాదేసి రఘువంశీ(82 నాటౌట్)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
A complete and utter demolition job at Eden Gardens 🔥
Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT pic.twitter.com/937iZPcOnQ
— IndianPremierLeague (@IPL) May 16, 2026
హోల్డర్‌ను రెండు సిక్సర్లతో అరుసుకోగా 9 ఓవర్లకు స్కోర్ వంద అయింది. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన అలెన్ 12వ ఓవర్లో సిక్సర్ కొట్టబోయి బౌండరీ వద్ద రషీద్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. అలెన్ ఔటైనా రఘువంశీ జతగా గ్రీన్ (52 నాటౌట్) దంచాడు. డెత్ ఓవరల్లో వీరిద్దరి విధ్వంసంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు కొట్టింది.