న్యూఢిల్లీ : బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కీలకం. బరువు తగ్గడంలో ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సాగాలి. ఈ ప్రక్రియలో జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. అయితే నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ సరైన సమయానికి భోజనం చేయకుంటే ఆశించిన ఫలితాలు రావు.
అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రతి రోజూ ఒకే సమయంలో సకాలంలో ఆహారం తీసుకోవడం అత్యంత కీలకమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సకాలంలో ఆహారం తీసుకోవడం ద్వారా దినచర్య పకడ్బందీగా ఉండేలా చూసుకోవచ్చు. సరైన సమయంలో ఆహారం తీసుకుంటే తరచూ స్నాక్స్, అల్పాహారం తీసుకునే అవసరం ఉండదు. ఇది మన జీవక్రియలు మెరుగ్గా ఉండేలా ఉపకరిస్తుంది. సకాలంలో ఆహారం తీసుకుంటే రోజంతా చురుకుగా ఉండవచ్చు.