కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఏ.ఎం.రత్నం సమర్పణలో శ్రీసాయి సూర్య మూవీస్, స్టార్‌లైట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు క్రిష్ క్లాప్‌నివ్వగా, చిత్ర సమర్పకుడు ఏ.ఎం.రత్నం కెమెరా స్విఛాన్ చేశారు. వెన్నెల కిషోర్, సత్య, అన్నుకపూర్, సిద్ధార్థ సేన్, అతుల్ పర్చురే, అశిష్ విద్యార్థి, అజయ్, గోపరాజు రమణ, జెమినీ సురేష్, తులసి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దులీప్ కుమార్, సంగీతం: అమ్రేష్ గణేష్, ఆర్ట్: ఎం. సుధీర్, ఎడిటర్: వరప్రసాద్, సమర్పణ: ఏ.ఎం.రత్నం, రచన-దర్శకత్వం: రత్నం కృష్ణ.