Guvvala Cheruvu Ghat | వరుస విజయాలతో జోరుమీదున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ముంబై వేదికగా జరిగిన ‘Prime Video Presents 2026’ గ్రాండ్ ఈవెంట్లో ఆయన నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘గువ్వల చెరువు ఘాట్’ (Guvvala Cheruvu Ghat) నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా విడుదల చేసింది. రాయలసీమ నేపథ్యంలో ప్రసిద్ధ ‘గువ్వల చెరువు ఘాట్’ ప్రాంతం ఆధారంగా ఒక ఇంటెన్స్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భరత్ కమ్మ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తుండగా, విడుదలైన గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఇందులో కిరణ్‌తో పాటు ‘మసూద’ ఫేమ్ తిరువీర్, సీనియర్ నటుడు సిద్ధిక్ మరియు సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ‘క’ (KA) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, అదే ఊపుతో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ద్వారా 2026లో ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. భరత్ కమ్మ మార్క్ మేకింగ్ మరియు పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్‌పై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.