Kim Jong-un: రైలులో రష్యా వెళ్తున్న కిమ్ జాంగ్-ఉన్
Kim Jong-un : ఉత్తర కొరియా నేత కిమ్.. రైలులో రష్యాకు వెళ్తున్నారు. మంగళవారం ఆయన పుతిన్‌తో భేటీకానున్నారు. రెండోసారి కిమ్ రష్యాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2019లో ఆయన మొదటిసారి వెళ్లారు.
న్యూఢిల్లీ: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్-ఉన్(Kim Jong-un) .. రష్యా పర్యటనకు వెళ్తున్నారు. ఆ దేశ రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి రష్యాకు ట్రైన్ బయలుదేరిందని, ఆ రైలులో కిమ్ జాంగ్ ఉన్నట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొన్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మంగళవారం కిమ్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రష్యాకు కిమ్ వెళ్లడం ఇది రెండో సారి అవుతుంది. 2019లో ఆయన మొదటిసారి ఆ దేశాన్ని విజిట్ చేశారు. ఖాసన్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఆయన వ్లాదివోస్కీకి వెళ్లారు. మరో వైపు ఉత్తర కొరియాపై అమెరికా ఆరోపణలు చేసింది. రష్యాకు కిమ్ ఆయుధాలను అందిస్తున్నట్లు అగ్రరాజ్యం పేర్కొన్నది. ప్రైవేటు మిలిటరీ వాగ్నర్ గ్రూపునకు ఉత్తర కొరియా ఆయుధాలు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

