Kim Jong Un | దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసేస్తాం : ఉత్తర కొరియా అధ్యక్షుడు
Kim Jong Un | ఉత్తర కొరియా (North Korea) - దక్షిణ కొరియా (South Korea) దేశాల మధ్య దూరం మరింత పెరగనుంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసేయనున్నట్లు ప్రకటించింది.
Kim Jong Un : ఉత్తర కొరియా (North Korea) – దక్షిణ కొరియా (South Korea) దేశాల మధ్య దూరం మరింత పెరగనుంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను వెలువరించింది.
దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. అకస్మాత్తుగా సంఘర్షణ తలెత్తకుండా యూఎస్ మిలిటరీకి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యోగ్యాంగ్ ఓ ప్రకటలో పేర్కొంది. ఈ చర్యను ‘ప్రధాన సైనిక చర్య’గా నార్త్ కొరియా అభివర్ణిస్తోంది.
1991లో ఉత్తర-దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన ఓ కీలక ఒప్పందాన్ని కిమ్ రాజ్యం రద్దు చేసుకోవాలని భావిస్తోంది. అంతేకాక దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని నిర్ణయించింది. పార్లమెంటరీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ, సమావేశాలు మంగళవారంతో ముగిసినప్పటికీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఉత్తర కొరియా ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయంపై స్పష్టత లేదు.
ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో సరిహద్దును పూర్తిగా మూసేసేందుకు ఉత్తరకొరియా సన్నాహాలు చేస్తోందని ఆ దేశ సైన్యం తాజాగా వెల్లడించింది. రోడ్డు, రైలు మార్గాలను నిలిపివేసి బలమైన రక్షణ నిర్మాణాలతో తమ ప్రాంతాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో సరిహద్దును పటిష్టం చేసే పనిలో ఉన్న ఉత్తర కొరియా సైనికులు కొందరు పేలుళ్ల కారణంగా మరణించారు.
అదే నెలలో రెండు కొరియాలను కలిపే రైల్వే లైన్లలోని భాగాలను ఉత్తర కొరియా కూల్చివేస్తోందన్న సంకేతాలను గుర్తించినట్లు సియోల్ గూఢచారి సంస్థ తెలిపింది. తమ శత్రు దేశంతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసేసి.. రాకపోకలను నివారించేందుకు ఉత్తర కొరియా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

