Kiliye Kiliye | మలయాళ యువ నటీనటులు కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘లోక: చాప్టర్ 1’ (తెలుగులో కొత్త లోక). ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘కిలియే కిలియే’ పూర్తి వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మమ్ముట్టి నటించిన మలయాళ చిత్రం ‘ఆ రాత్రి’ (1983)లోని ‘కిలియే కిలియే’ పాటను రీమిక్స్ చేసి ఇందులో జత చేశారు మేకర్స్. ఈ పాటలో కళ్యాణి ప్రియదర్శన్ స్టైలిష్ ఎంట్రీ సినిమాకే హైలైట్గా నిలిచింది. కాగా ఈ పాటను మీరు చూసేయండి.