Border 2 | గదర్ 2, జాట్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బోర్డర్ 2. ఈ సినిమాకు సినిమాకు అనురాగ్‌సింగ్ దర్శకత్వం వహించనుండగా.. భూషణ్‌కుమార్, కృష్ణన్‌కుమార్, జేపీదత్తా, నిధిదత్తా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిలిజిత్ దోసాంజే, అహాన్ శెట్టి, సోనమ్ బజ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ నుంచి చిత్రబృందం తాజాగా వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. వరుణ్ ధావన్ ఇందులో హోషియర్ సింగ్ దాహియా (Hoshiyar Singh Dahiya) అనే పాత్రలో కనిపించబోతుండగా ఈ ఫస్ట్ లుక్‌లో వరుణ్ ధావన్ గన్ పట్టుకుని శత్రువులను కాల్చుతున్నట్లు కనిపిస్తుంది.
VARUN DHAWAN’S FIRST LOOK FROM ‘BORDER 2’ UNVEILED – 23 JAN 2026 RELEASE… After the tremendous response to the first poster of #Border2 featuring #SunnyDeol, the makers have now unveiled the #FirstLook of #VarunDhawan from the film.
Releases worldwide on 23 Jan 2026 –… pic.twitter.com/w4YQcHWTtw
— taran adarsh (@taran_adarsh) November 5, 2025