ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 8: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, నిమజ్జనాన్ని మంచి వాతావరణంలో జరుపుకోవాలని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు బెల్లం వేణు యువకులకు సూచించారు. గురువారం నాయుడుపేట ఎస్సీకాలనీలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత గణేశ్ విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. శనివారం జరిగే నిమజ్జనం కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, నాయకులు బట్టపోతుల సతీశ్, కనకయ్య, మానుకొండ శ్రీను, పోతుల కృష్ణ, చీరాల వీరభద్రం, సుధాకర్, అంజిబాబు, మేకల ఉదయ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బోనకల్లులో..
బోనకల్లు, సెప్టెంబర్ 8: శ్రీసాయిగణేష్యూత్ ఆధ్వర్యంలో బొడ్రాయి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం సర్పంచ్ భూక్యా సైదానాయక్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు యశ్వంత్, వంశీ, మోహన్, కార్తీక్, సుభాని, బడేమియా, షారుక్‌ఖాన్ పాల్గొన్నారు.
ఎర్రుపాలెంలో..
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 8: మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై మేడా ప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. తొలుత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కూరపాటి సుందరమ్మ, ఎంపీటీసీ కూరపాటి యశోద, ఉపసర్పంచ్ అయిలూరి నాగిరెడ్డి, గ్రామకార్యదర్శి కే శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శీలం అక్కమ్మ, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ అయిలూరి రవీంద్రారెడ్డి, చెరుకూరి కోటేశ్వరరావు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కూసుమంచి రూరల్‌లో..
కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 8: మండలంలోని మల్లాయిగూడెం, హట్యాతండా, జుజ్జల్‌రావుపేట, నర్సింహులగూడెం, పెరికసింగారం, ఎర్రగడ్డతండాల్లోని గణేశ్ మండపాల వద్ద గురువారం ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాలకు ఉత్సవ కమిటీల సభ్యులు జర్పుల శ్రీనివాస్, బోయిన సాయి, వీరబాబు, బాదావత్ సాయి, అనిల్, అంజి, నరేశ్, కిషన్‌నాయక్ నేతృత్వం వహించారు.
బీరోలులో..
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 8: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం వినాయక మండపాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. బీరోలులో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని సర్పంచ్ వంచర్ల అలివేలమ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఏనుగుల మాలతి, గ్రామ పెద్దలు వంచర్ల సత్యనారాయణరెడ్డి, శ్రీధర్, కమటం లక్ష్మణ్, వెంకన్న, శ్రీను, సాయిరామ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.