మధిరరూరల్, సెప్టెంబర్ 8: మండలంలోని ఖాజీపు రానికి చెందిన అహ్మద్‌ఖాన్ (లేట్), గుల్జార్ దంపతుల కుమార్తె షేక్ మెహర్నాజ్ నీట్లో 563వ ర్యాంకు, మహదేవపురం గ్రామానికి చెందిన కనపర్తి రామారావు కుమారుడు కనపర్తి మనోజ్‌కుమార్ 530వ ర్యాంకు సాధించారు. విద్యార్థులను పలువురు అభినందించారు.
బోనకల్లులో..
బోనకల్లు, సెప్టెంబర్ 8: మండలంలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ అమీర్సాహేబ్ కుమార్తె షేక్ సానియా నీట్ పరీక్షా ఫలితాల్లో 576 మార్కులు సాధించింది. సానియాకు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, అధ్యాపకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.