టొరంటో, అక్టోబర్ 21: ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌పై మళ్లీ బెదిరింపులకు దిగాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏండ్లు కావస్తున్న సందర్భంగా ‘ఎయిర్ ఇండియా’ విమానాలపై దాడి జరగవచ్చునని పన్నూ హెచ్చరికలు జారీచేశాడు. నవంబర్ 1 నుంచి 19 వరకు ‘ఎయిర్ ఇండియా’ విమానాల్లో ఎవరూ ప్రయాణించవద్దని అతడు సోమవారం వార్నింగ్ ఇవ్వటం సంచలనం రేపింది. గత కొద్ది రోజులుగా భారత్‌లో పలు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ తరుణంలో పన్నూ నుంచి ఈ విధమైన బెదిరింపులు వెలువడటం చర్చనీయాంశమవుతున్నది. గత ఏడాది కూడా పన్నూ ఇదే విధమైన తీవ్రమైన మాటలతో భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు.