Kadgam | ఖడ్గం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు ఈ సినిమా తప్పక ప్రసారం కావల్సిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో హీరో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక కథానాయికలుగా సోనాలి బింద్రే, సంగీత నటించారు. ఇక చిత్రంలో ఓ భామ స్పెషల్ అట్రాక్షన్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మరెవరో కాదు కిమ్ శర్మ. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ వచ్చే పాటతో ఓ ఊపు ఊపేసిన ఈ చిన్నది తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో ఖడ్గం హీరోయిన్.. ఇప్పుడు ఈ భామ ఏం చేస్తుంది..!
అయితే చాలా మంది తారలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ నుండి మెల్లగా తప్పుకుంటున్నారు. ఆ కోవలో కిమ్ శర్మ కూడా ఒకరు.ఖడ్గం చిత్రంలో శ్రీకాంత్ వెంటపడినఈ అమ్మాయి ఖడ్గం సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ లో నటించింది. రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో కూడా ఈ భామ స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అయితే ఎందుకో ఈ మధ్య తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. బాలీవుడ్లో సెటిల్ అయిందని తెలుస్తుండగా, అక్కడ పలు సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.
కిమ్ శర్మ.. బీటౌన్ నటుడు హర్షవర్దన్ రానాతో ప్రేమాయణం సాగించినట్టు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఇద్దరు పలుమార్లు బయట జంటగా కనిపించారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని ఈ ఇద్దరు విడిపోయారు. అయితే సినిమాలకి కాస్త దూరంగా ఉంటున్న కిమ్ శర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ప్రస్తుతం కిమ్ శర్మ వయసు 44 ఏళ్లు వయస్సు ఉంటుందని, ఈ వయసులోనూ ఏమాత్రం చెరగని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైన ఈ వయస్సులోను కిమ్ శర్మ ఇలా రెచ్చగొడుతుండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.