KCR | జోగినపల్లి శ్రీనివాసరావుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి.. Video
KCR | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు. జోగినపల్లి శ్రీనివాసరావు దశదిన కర్మ కార్యక్రమం నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ కొంపల్లిలోని జోగినపల్లి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.
KCR : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు. జోగినపల్లి శ్రీనివాసరావు దశదిన కర్మ కార్యక్రమం నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ కొంపల్లిలోని జోగినపల్లి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఇటీవల సికింద్రాబాద్ యశోద దవాఖానలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ సతీమణి శోభమ్మకు జోగినపల్లి శ్రీనివాసరావు స్వయానా సోదరుడు. ఈ నెల 14న జోగినపల్లి శ్రీనివాసరావు అంత్యక్రియల్లో కూడా కేసీఆర్ పాల్గొన్నారు. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్ https://t.co/eCJ3l3UtP2 pic.twitter.com/nQEndx4qTv
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

