హైదరాబాద్ : ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా..ఈ నెల 15 నుంచి ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్- 2022 ప్రారంభించనున్నారు. ఈ టోర్నీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో హైదరాబాద్ గల ఎల్బీ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగంలో వాలీబాల్ మ్యాచ్ లు జరగనున్నాయి.
ఈ టోర్నమెంట్లో మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు లక్ష రూపాయలు, రెండు, మూడవ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతిని అందించనున్నారు.