వీణవంక, సెప్టెంబర్ 28 : చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ రేవంత్ సర్కార్ నెరవేర్చాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కళ్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం సర్వసభ్య సమావేశం లో సోమవారం మాట్లాడారు. ఈ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ కూడా వేరే వారికి ఇచ్చి కార్మికుల పొట్ట కొట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వస్తున్నందున ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్యాష్కట్ కూడా మాఫీ చేయాలని కోరారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, చెప్పిన ప్రతి పనిని తప్పకుండా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.