Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Katrina Kaif | బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ అభిమానులకు దీపావళి సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తమ కుమారుడి ఫొటోలను బయటకు చూపించకుండా జాగ్రత్త పడిన ఈ జంట.. తొలిసారి తమ ముద్దుల తనయుడు విహాన్‌తో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ అందమైన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Katrina Kaif | బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ అభిమానులకు దీపావళి సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తమ కుమారుడి ఫొటోలను బయటకు చూపించకుండా జాగ్రత్త పడిన ఈ జంట.. తొలిసారి తమ ముద్దుల తనయుడు విహాన్‌తో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ అందమైన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా చిన్నారి విహాన్ క్యూట్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. కత్రినా కైఫ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఇందులో కత్రినా, విక్కీ కౌశల్ తమ కుమారుడు విహాన్‌తో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. క్రీమ్ కలర్ కుర్తా పైజామాతో పాటు పసుపు రంగు నెహ్రూ జాకెట్ ధరించిన చిన్నారి విహాన్.. తల్లిదండ్రుల మధ్య నిలబడి కెమెరా వైపు చూస్తూ చిరునవ్వులు చిందించాడు.
ఇక కత్రినా పసుపు రంగు ఎంబ్రాయిడరీ దుస్తుల్లో మెరిసిపోయింది. నేలపై కూర్చుని తన కుమారుడిని ప్రేమగా పట్టుకున్న ఆమె ఎంతో మురిసిపోతూ కనిపించింది. మరోవైపు విక్కీ కౌశల్ క్రీమ్ కలర్ కుర్తాలో తన కొడుకు పక్కన కూర్చుని నవ్వుతూ ఫొటోకు పోజిచ్చాడు. ఈ ఫొటోను షేర్ చేసిన కత్రినా.. ‘ఇప్పటివరకు జరిగిన దీపావళులలోకెల్లా ఇదే అత్యంత ప్రకాశవంతమైనది. ప్రతి ఒక్కరూ ప్రేమ, వెలుగు, ఆనందంతో ఆశీర్వదించబడాలి’ అంటూ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపింది. కాగా, నవంబర్ 7న విహాన్ తన మొదటి పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకోవడం విశేషం. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2025 నవంబర్ 7న తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత అతడి ఫొటోలను బహిరంగంగా పంచుకోకుండా గోప్యత పాటించారు.
ఆ తర్వాత 2026 జనవరిలో విక్కీ కౌశల్ తన కుమారుడి చిన్న చేతిని పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అతడికి ‘విహాన్ కౌశల్’ అని పేరు పెట్టినట్లు అధికారికంగా వెల్లడించాడు. అప్పటి నుంచి అభిమానులు విహాన్‌ను ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దీపావళి సందర్భంగా తొలిసారి పూర్తి ఫ్యామిలీ ఫొటోను షేర్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విక్కీ కౌశల్ తన కుమారుడికి విహాన్ అనే పేరు పెట్టడం వెనుక ఓ ప్రత్యేక అనుబంధం ఉందనే చర్చ జరుగుతోంది. 2019లో విడుదలైన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో విక్కీ మేజర్ విహాన్ సింగ్ షేర్గిల్ అనే ఆర్మీ అధికారి పాత్రలో నటించాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన కుమారుడికి కూడా విహాన్ అనే పేరు పెట్టడంతో అభిమానులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

