AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
AK 47 Collections | విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెంబర్ 47’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. విడుదలైన తొలి రోజుల్లో మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వసూళ్ల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
AK 47 Collections | విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెంబర్ 47’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. విడుదలైన తొలి రోజుల్లో మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వసూళ్ల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. వీక్‌డేస్‌తో పోలిస్తే వీకెండ్లో కలెక్షన్లు కొంత పెరిగినప్పటికీ, సినిమా మాత్రం నష్టాల దిశగా పయనిస్తోందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’పై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలవడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా, నారా రోహిత్, నివేతా పేతురాజ్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ, యువీనా, రాజా ప్రజ్వల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాలేదు. ‘ఆదర్శ కుటుంబం’ విడుదలై పది రోజులు పూర్తయ్యాయి. రెండో ఆదివారం కావడంతో పదో రోజు వసూళ్లలో కొంత పెరుగుదల కనిపించింది. అందుబాటులో ఉన్న ట్రేడ్ అంచనాల ప్రకారం, పదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.1.60 కోట్ల నెట్, రూ.1.85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్లో మరో రూ.10 లక్షలు రాబట్టింది. దీంతో రెండో ఆదివారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
శనివారంతో పోలిస్తే ఆదివారం వసూళ్లు మెరుగుపడటం కొంత ఊరటనిచ్చే అంశమే. అయితే ఈ పెరుగుదల సినిమా బాక్సాఫీస్ పరిస్థితిని మార్చే స్థాయిలో లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక పది రోజుల మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.69.80 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. ఇందులో ఇండియా నుంచి రూ.53.20 కోట్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.16.60 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.70 కోట్లకు పైగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇక థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.63 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. ప్రాంతాల వారీగా చూస్తే నైజాంలో రూ.17 కోట్లు, సీడెడ్‌లో రూ.7 కోట్లు, ఆంధ్రాలో రూ.20 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణలో కలిపి సుమారు రూ.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు అంచనా. ఇక ఇతర రాష్ట్రాల్లో రూ.6 కోట్లు, ఓవర్సీస్లో రూ.13 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కుల విలువ రూ.63 కోట్లుగా చెబుతున్నారు.ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే షేర్ పరంగా గణనీయమైన వసూళ్లు అవసరం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

