నారాయణపేట : నారాయణ పేట( Narayanapet District) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏక్లాస్ పూర్ గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నారాయణపేట నుంచి గుర్మీత్కల్కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును( Karnataka RTC Bus ) ఎదురుగా వచ్చిన కమాండర్ జీపు( Karnataka RTC Bus) ఢీకొంది.
దీంతో జీపులో ప్రయాణిస్తున్న సిపురానికి చెందిన భీమరాయ అనంతమ్మ (55) , నారాయణపేట పట్టణం కుమ్మరి వీధికి చెందిన శిరీష( 10) అనే బాలిక దుర్మరణం చెందింది. జీపులో ప్రయాణిస్తున్న కుమ్మరి ఊషన్న , జీపు డ్రైవర్ చిన్న మల్లికార్జున్, కోటగిరి నరసింహ, కోటగిరి శరణమ్మ , కుమ్మరి బాలకృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలాన్ని నారాయణపేట టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు, రేవతి పరిశీలించారు. కర్ణాటక బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.