కలెక్టరేట్, మార్చి 14: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ 184మంది నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి 90, ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 20, పంచాయతీ శాఖకు సంబంధించి 20, మున్సిపల్‌కు సంబంధించి 10, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి 10, ఇతర శాఖలకు సంబంధించి 34 దరఖాస్తులు వచ్చినట్లు పేరొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిషరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
సమస్యలను వేగంగా పరిషరించాలి
సమస్యలను వేగంగా పరిషరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘డయల్ యువర్ కలెక్టర్’ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఫోన్లో సమస్యలు తెలుపగా పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన సమస్యలను పెండింగ్ లో పెట్టకుండా పరిషరించాలని అధికారులకు సూచించారు. 15నుంచి 17ఏండ్లలోపు వయ స్సు వారికి మొదటి, రెండో డోసు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రత్యేకాధికారులు మండలాలను సందర్శించి నర్సరీలు, ప్రకృతి వనాలు, పల్లె ప్రగతి పనులపై శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్‌కుమార్, డీఆర్డీవో శ్రీలత, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మణ్, డీపీవో వీర బుచ్చయ్య, జిల్లా మత్స్యశాఖ ఏడీ రాజనరసయ్య, డీవైఎస్వో రాజవీరు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి నటానియల్, ఎస్టీ అభివృద్ధి శాఖ అధికారి గంగారాం, బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజమనోహర్, ఎల్డీఎం లక్ష్మణ్, మె ప్మా పీడీ రవీందర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, పశుసంవర్ధక శాఖ అధికారి నరేందర్, ఇతర శాఖ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.