బాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. హిందీ పాటలు ప్రపంచమంతా మార్మోగుతుంటాయి. కాగా, ఓ పాకిస్తానీ వీధుల్లో హిందీపాటలు పాడుతూ అక్కడివారిని అలరిస్తున్నాడు. అతడి పాట వింటే ఎవరైనా సరే మైమరిచిపోవాల్సిందే. అతడు పాడిన ‘అభీ ముజ్ మే కహీ’ పాటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోను పాకిస్థానీ యూట్యూబర్ అహ్మద్‌ఖాన్ షేర్ చేశారు. ఆరిఫ్‌ఖాన్ అనే వ్యక్తి జోకర్ వేషంలో పాకిస్తాన్‌లోని కరాచీ వీధుల్లో తిరుగుతుండగా అహ్మద్‌ఖాన్ కంటపడ్డాడు. పిల్లలను నవ్వించడమే తన పని అని, పాటలు పాడుతానని చెప్పాడు. అహ్మద్‌ఖాన్ కోరికమేరకు ఆరిఫ్‌ఖాన్.. 2012లో విడుదలైన బాలీవుడ్ సినిమా అగ్నిపథ్‌లోని ‘అభీ ముజ్ మే కహీ పాట’ను ఆలపించాడు. ఈ వీడియో లక్షలాది మనసు దోచుకుంది. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. ఆరిఫ్‌ఖాన్ పాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.