Amitab Bachchan | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్తామ పాత్రలో నటించారు. ఈ మూవీలో బిగ్ బీ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుందని తెలిసిందే. అమితాబ్ బచ్చన్‌పై వచ్చే యాక్షన్ పార్ట్ గూస్బంప్స్ తెప్పిస్తోంది.
ఏడు పదుల వయస్సు దాటిన అమితాబ్ బచ్చన్‌ను పవర్ ఫుల్ రోల్లో చూపించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు నాగ్ అశ్విన్. కల్కి యూనివర్స్‌లో కల్కి 2 కూడా ఉండబోతుందని తెలిసిందే. ఇప్పటికే సీక్వెల్ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మేకర్స్ అమితాబ బచ్చన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్కి 2 అప్డేట్ అందించారు.
లెజెండరీ అమితాబ్ బచ్చన్ సార్‌కు కల్కి 2898 ఏడీ బృందం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన అంకితభావం, పవర్ఫుల్ ప్రజెంటేషన్ మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. త్వరలోనే బిగ్ బీ కల్కి సినిమాటిక్ యూనివర్స్ సెట్స్‌లోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాము..అని మేకర్స్ ట్వీట్ చేశారు.
కల్కి 2898 ఏడీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సీక్వెల్లో దీపికాపదుకొనే స్థానంలో అలియాభట్ పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Team #Kalki2898AD wishes a very Happy Birthday to the Legendary @SrBachchan sir!
His dedication, grace, and powerful presence continue to inspire us all.Looking forward to his return to the KALKI Cinematic Universe sets soon. ✨ pic.twitter.com/03SkW3g1YY
— BA Raju’s Team (@baraju_SuperHit) October 11, 2025
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!
RC 17 | రామ్ చరణ్ -సుకుమార్ ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది అంటే..!