‘బంధాలకు పునాది నమ్మకమే. ఆ నమ్మకం ఒక్కసారి ఒమ్మయితే, పరిస్థితుల్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడం అసాధ్యం’ అంటున్నది అందాలభామ కాజల్ అగర్వాల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మానవ సంబంధాలు, మానసిక ప్రశాంతతలపై ఆసక్తికరంగా మాట్లాడింది కాజల్. ‘ప్రేమ, స్నేహం, కుటుంబం, వృత్తి.. ఇలా ఎక్కడైనా సరే.. నమ్మకద్రోహానికి ఒడిగట్టే వ్యక్తులకు జీవితంలో స్థానం ఇవ్వకూడదు.
స్వార్థపూరిత ఆలోచనలతో నమ్మకాన్ని తుంగలో తొక్కే వారితో కలిసి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. పైకి నవ్వుతూ, లోపల స్వార్థాన్ని దాచుకునే వారిని గుర్తించి, వారికి దూరంగా ఉండటమే శ్రీరామరక్ష. అవసరాల కోసం స్నేహాన్నీ, సంబంధాలనూ వాడుకునే స్వార్థపరులు ప్రతి రంగంలోనూ ఉంటారు’ అని కాజల్ వ్యాఖ్యానించింది. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.