ముంబై: సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే మంగళవారం ముంబై చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ హోటల్‌కు వెళ్లారు. కరోనా నేపథ్యంలో ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ కారణంగా స్టార్ పేసర్లు ఇద్దరూ సీజన్లో ఢిల్లీ ఆడే తొలి మ్యాచ్‌కు దూరంకానున్నారు.
ఐపీఎల్ 2021లో భాగంగా ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ తలపడనుంది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన లీగ్‌లో ఫాస్ట్‌బౌలర్లు సంచలన ప్రదర్శన చేసి జట్టును తొలిసారి ఫైనల్ వరకు తీసుకెళ్లారు. డీసీ ఫ్యామిలీలోకి పేసర్లు వచ్చేశారని ఫ్రాంఛైజీ ట్వీట్ చేస్తూ ఆటగాళ్లిద్దరూ దిగిన ఫొటోను షేర్ చేసింది.
Name this duo that has just arrived back to our DC Family 💙🤗
— Delhi Capitals (@DelhiCapitals) April 6, 2021
Wrong answers only 👀#YehHaiNayiDilli #IPL2021 @TajMahalMumbai pic.twitter.com/El3XLOy74y