న్యూఢిల్లీ: రాబోయే ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొనేందుకు సౌతాఫ్రికా స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబాడ ముంబైలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కలవడానికి వచ్చేస్తున్నారు. భారత్‌కు వచ్చే ముందు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరూ ఎయిర్‌పోర్టులో దిగిన ఫొటోను ఢిల్లీ ట్విటర్లో పోస్ట్ చేసింది.
ముంబైలో ఏడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న జట్టులోని పలువురు ఆటగాళ్లు గత వారమే ట్రైనింగ్ ప్రారంభించారు. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతున్న జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు తొలిసారి సహాయ కోచ్ మహ్మద్ కైఫ్ హాజరయ్యారు. వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
𝗡𝗼𝘄 𝗕𝗼𝗮𝗿𝗱𝗶𝗻𝗴: The only #MondayMotivation you need 💙@AnrichNortje02 & @KagisoRabada25 are ON THEIR WAY to #IPL2021 🔥#YehHaiNayiDilli pic.twitter.com/vWLHeCjiKY
— Delhi Capitals (@DelhiCapitals) April 5, 2021